గత జన్మలో 'ఆమె' తన భర్తేనట... బీటెక్ విద్యార్థినిపై మరో మహిళ ఉన్మాదం!
Advertisement
Advertisement
"గత జన్మలో నువ్వే నా భర్త. ఈ జన్మలో అమ్మాయిగా జన్మించావు. నువ్వు నాతోనే ఉండాలి" అంటూ ఓ వివాహిత మహిళ, బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థినిని వేధిస్తున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ముంబైకి చెందిన వెరోనికా బరోడే అలియాస్ కిరణ్ (35) ఓ విద్యాసంస్థలో ట్యూటర్. ముంబైలోని ఓ ఆసుపత్రిలో తల్లికి సహాయకారిగా ఉండేందుకు వచ్చిన ఇండోర్ కు చెందిన బీటెక్ విద్యార్థిని కిరణ్ కు పరిచయం కావడంతో ఇద్దరూ స్నేహితులయ్యారు.

ఈ క్రమంలో ఆమెతో స్నేహం పెంచుకున్న కిరణ్, ఆపై ఉన్మాదిగా మారి వేధింపులకు దిగింది. ఇద్దరమూ పెళ్లి చేసుకుందామని పోరు పెట్టింది. దీంతో విద్యార్థిని విసిగిపోయి, ఆమెతో మాట్లాడటం మానేయగా, ఇండోర్ కు వెళ్లి, ఆమె గురించి ఆరా తీసింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని వేధిస్తూ, ఓ కానిస్టేబుల్ సాయంతో ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. తేరుకున్న విద్యార్థిని, సేఫ్టీ అలారం మోగించడంతో, చుట్టుపక్కల వారు వచ్చి, కిరణ్, కానిస్టేబుళ్లను నిర్బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో కిరణ్ చెప్పిన కారణాలు విని విస్తుపోయిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Mon, Sep 10, 2018, 11:43 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View