ఆత్మహత్యా యత్నం చేసిన కాన్పూర్‌ సిటీ ఎస్పీ మృతి
Advertisement
కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యా యత్నం చేసిన ఐపీఎస్‌ అధికారి సురేంద్రకుమార్‌దాస్‌ (30) చికిత్స పొందుతూ చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌ సిటీ (ఈస్ట్‌)కి ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న దాస్‌ బుధవారం ఎలుకల మందు తిన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు  కాన్పూర్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

విష ప్రభావం వల్ల శరీరంలోని చాలాభాగాలు పనిచేయడం మానేయడంతో ఆదివారం ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యుడు రాజేష్‌ అగర్వాల్‌ తెలిపారు. 2014 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన సురేంద్రకుమార్‌ వైవాహిక జీవితంలో కలతలు, కుటుంబ సంబంధాలు దెబ్బతినడంతో మానసికంగా కుంగిపోయి తీవ్రనిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. కాగా, దాస్‌ మృతిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Mon, Sep 10, 2018, 11:24 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View