ఎన్టీఆర్ ను చూస్తే.. మళ్లీ పాత ఎనర్జీని తెచ్చుకున్నట్టు అనిపించింది!: తమన్
Advertisement
తమ తండ్రి నందమూరి హరికృష్ణ హఠాన్మరణాన్ని దిగమింగుకుని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు షూటింగ్ ల బాట పట్టారు. మనసులో ఎంతో భాధ ఉన్నా... సినిమాల షూటింగ్ లకు అంతరాయం కలగకూడదనే భావనతో వారు పనిలో నిమగ్నమయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవిందసమేత' షూటింగ్ లో తారక్ బిజీ అయ్యాడు. నిన్న ఓ సాంగ్ ను చిత్రీకరించారు. దీనిపై సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశాడు.

'చాలా ఎమోషనల్ గా తారక్ అన్న ఓ సాంగ్ కోసం షూటింగ్ స్టార్ట్ చేశారు. తన డ్యాన్స్ తో మళ్లీ తన పాత ఎనర్జీని తెచ్చుకున్నట్టుగా అనిపించింది. తారక్ అన్నను మళ్లీ ఈ విధంగా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. 'అరవింద సమేత' టీమ్ తరపున తారక్ కు లాట్స్ ఆఫ్ లవ్. ఆడియో అప్ డేట్స్ కూడా ఈ వారంలో స్టార్ట్ అవుతాయి' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 
Mon, Sep 10, 2018, 11:17 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View