తెలంగాణ ముందస్తు ఎన్నికలపై సుప్రీంను ఆశ్రయించనున్న జంధ్యాల రవిశంకర్... అభిషేక్ సింఘ్వీతో భేటీ!
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ రంగంలోకి దిగారు. ముందుగానే ఎన్నికలు జరగడం వల్ల సుమారు 20 లక్షల మంది యువత తమ ఓటు హక్కును కోల్పోనున్నారని పేర్కొంటూ, సుప్రీంకోర్టులో పిటిషన్ ను ఆయన దాఖలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

నేడు ఢిల్లీకి బయలుదేరిన ఆయన, కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో చర్చించి, ఆపై పిటిషన్ ను దాఖలు చేస్తారని తెలుస్తోంది. కాగా, ఎన్నికలను ఎదుర్కొనే శక్తి లేకనే, అడ్డదారుల్లో ఎన్నికలను ఆపే ప్రయత్నాన్ని చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డి, రవిశంకర్ లు వ్యర్థ ప్రయత్నాలు మానుకొని దమ్ముంటే ఎన్నికల్లో తలపడాలని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ నిప్పులు చెరిగారు.
Mon, Sep 10, 2018, 11:16 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View