టెలికాం కంపెనీలకు భారీ జరిమానా విధించిన ట్రాయ్
Advertisement
దేశీయ టెలికాం దిగ్గజాలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మరోసారి షాక్ ఇచ్చింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో విఫలమయ్యారంటూ భారీ జరిమానా విధించింది. జరిమానాకు గురైన సంస్థల్లో జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు ఉన్నాయి.

2017 అక్టోబర్ 1 నుంచి సేవల ప్రమాణాలను ట్రాయ్ కఠినతరం చేసింది. జనవరి-మార్చి నెలల మధ్య కాలంలో సేవల లోపాలకు సంబంధించి పెనాల్టీని విధించింది. జియోకు రూ. 34 లక్షలు, ఎయిర్ టెల్ కు రూ. 11 లక్షలు, ఐడియాకు రూ. 12.5 లక్షలు, వొడాఫోన్ కు రూ. 4 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ జరిమానాలపై సదరు టెలికాం కంపెనీల ప్రతినిధులు ఇంకా స్పందించలేదు.  
Mon, Sep 10, 2018, 10:59 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View