నేడు చంద్రబాబు పెళ్లి రోజు... గుర్తు చేసిన లోకేశ్!
Advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు నేడు వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటుండగా, వారి కుమారుడు లోకేశ్, ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "అమ్మా, నాన్నా హ్యాపీ యానివర్సరీ. ఇటువంటి వార్షికోత్సవాలను మరెన్నో మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఇదే విధమైన ప్రేమ, ఆప్యాయతలను ఒకరిపై ఒకరు చూపుతూ, పర్ఫెక్ట్ కపుల్ గా ఆదర్శంగా నిలవాలి" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

కాగా, 1981 సెప్టెంబర్ పదవ తేదీన అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరికి చెన్నైలోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
Mon, Sep 10, 2018, 10:18 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View