అందరూ కలిస్తే, కేసీఆర్ ఇక కనిపించడు: వీహెచ్
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ కలిస్తే, కేసీఆర్ కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజల్లో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అండగా నిలిచిన సెటిలర్లు, ఇప్పుడు టీఆర్ఎస్ కు ఓట్లు వేసే పరిస్థితి లేదని అన్నారు. సెటిలర్లకు కేసీఆర్ భరోసా ఇవ్వలేకపోయారని అన్నారు. తమ పార్టీకి తెలంగాణ సీఎం అయ్యే చాన్స్ వస్తుందని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ భయపడ్డారని వ్యాఖ్యానించిన వీహెచ్, ఆ వెంటనే అసదుద్దీన్‌ తో 'మళ్లీ సీఎం కేసీఆరే అవుతారు' అని చెప్పించారని ఎద్దేవా చేశారు.
Mon, Sep 10, 2018, 10:10 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View