గచ్చిబౌలి చౌరస్తాలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి దుర్మరణం!
Advertisement
హైదరాబాద్ లోని గచ్చిబౌలి చౌరస్తాలో ఈ రోజు ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపక్కనే వెళుతున్న పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. హెచ్ సీయూ డిపోకు చెందిన ఈ బస్సు లింగంపల్లి నుంచి కోఠికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఇక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon, Sep 10, 2018, 09:40 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View