సెక్స్ ప్రలోభాలకు లొంగితే నేరమే... ఇకపై ఏడేళ్ల జైలు శిక్ష, రాష్ట్రపతి సంతకం!
Advertisement
లైంగిక సేవలను లంచంగా కోరుకోవడం, ఎవరైనా వాటిని ఆఫర్ చేస్తే, అంగీకరించి వారికి అవసరమైన పనులు చేసిపెట్టడం వంటివి ఇకపై నేరాలే. అవినీతి నిరోధక సవరణ చట్టం-2018 ప్రకారం, అనుచితమైన ప్రయోజనాలు పొందడం శిక్షార్హమైన నేరం. దీనికి గరిష్ఠంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ చట్టంపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం కూడా పెట్టేశారు.

మూడు దశాబ్దాల నాటి అవినీతి నిరోధక చట్టాన్ని మరింత శక్తిమంతం చేస్తున్న ఈ సవరణల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా లైంగిక సేవలను పొందినా, విలాసవంతమైన క్లబ్బుల్లో సభ్యత్వాలు, ఖరీదైన ఆతిథ్యాలు పొందినా కేసులను ఎదుర్కోవాల్సివుంటుంది. బంధువులు, స్నేహితులు, ఇతరులకు సాయం చేసి, వారి నుంచి అనుచిత ప్రయోజనం పొందినా, ఈ చట్టం ప్రకారం శిక్షార్హులే. విహార యాత్రలకు వెళ్లేందుకు టికెట్లను బహుమతిగా పొందినా నేరమే అవుతుందని, 'అనుచిత ప్రయోజనం' అన్న పదం రాబోయే రోజుల్లో విస్తృత రూపం సంతరించుకుని చట్టం అమలుకు దోహదపడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.
Mon, Sep 10, 2018, 09:37 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View