మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వరరావుపై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు!
Advertisement
గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నల్లారి వెంకటనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోమ్ శాఖ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వసంత నాగేశ్వరరావుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. గుంటుపల్లిలో ప్లెక్సీల వివాదం దుమారాన్ని రేపుతుండగా, వెంకటనరసింహారావుకు ఫోన్ చేసిన వసంత, పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 ఆ ఫోన్ కాల్ ను రికార్డు చేసిన నరసింహారావు, దాన్ని పోలీసులకు వినిపించారు. ఈ ఆడియోటేప్ ను ప్రాథమిక సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకున్న తాము కేసు నమోదు చేశామని, ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టామని సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఈ ఆడియో టేపులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతున్నామని, కేసు విచారణ విషయమై న్యాయ నిపుణుల సలహాలనూ తీసుకుంటున్నామని చెప్పారు. 
Mon, Sep 10, 2018, 08:30 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View