సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తన జీవితంలో సినిమా అనేది ఒక భాగం మాత్రమేనని అంటోంది కథానాయిక నిత్యా మీనన్. 'నా జీవితంలో చాలా వున్నాయి. అందులో సినిమా అనేది ఒక భాగం. సినిమానే జీవితం కాదు. అందుకని వచ్చిన ప్రతి ఆఫర్ నీ ఒప్పుకోను. నేను చేయాలనుకునే పనులు చాలా వున్నాయి. వాటి సమయాన్ని బట్టి.. వీలును బట్టి సినిమాలు చేస్తుంటాను' అని చెప్పింది నిత్య.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అరవింద సమేత' చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటల చిత్రీకరణ జరుపుతారు. మరోపక్క, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తారు.
*  వివాహం తర్వాత నాగ చైతన్య, సమంత కలసి నటించే చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున మొదలవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొత్తగా పెళ్లయిన ఓ జంట జీవితంలో చోటు చేసుకున్న కష్టసుఖాల గురించి చర్చిస్తుంది. 
Mon, Sep 10, 2018, 07:22 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View