బిగ్‌బాస్‌లో ‘సిల్లీఫెలోస్’ సందడి.. హౌస్ నుంచి శ్యామల ఔట్!
Advertisement
స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ హౌస్‌లో ఆదివారం ‘సిల్లీఫెలోస్’ సందడి చేశారు. కమెడియన్లు సునీల్, నరేశ్‌లు సినిమా ప్రమోషన్‌లో భాగంగా హౌస్‌ లోకి వచ్చారు. ఇంటి సభ్యులతో ముచ్చట్లాడారు. సినిమా గురించి చర్చించారు. అందులో భాగంగా కంటెస్టెంట్లతో కలిసి గేమ్ ఆడారు.

కాగా, ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి శ్యామల ఎలిమినేట్ అయింది. గతంలో ఓసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శ్యామల  వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రెండోసారి షోలోకి ఎంటరైంది. అయితే, గతవారం ఇచ్చిన టాస్క్‌లలో ఆమె సరైన ఆటతీరు కనబరచకపోవడంతో షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. కౌశల్, అమిత్, దీప్తి ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లి బతికిపోయారు.
Mon, Sep 10, 2018, 07:01 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View