కొండచిలువతో చిన్నారి ఆటలు.. నెటిజన్ల ఆగ్రహం!
Advertisement
ఏడాది బుడతడు వేటితో ఆడుకుంటాడు? బొమ్మలతోనో లేదంటే తోటి చిన్నారులతోనో ఆడుకుంటాడు. కానీ ఓ చిన్నారి కొండచిలువతో ఆడుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తల్లిదండ్రులు తమ చిన్నారి ఆడుకుంటున్నాడులే అని కాసేపు ఆదమరిస్తే, ఆ చిన్నారి వెళ్లి కొండ చిలువతో ఆడుకోవడం ప్రారంభించాడు. దాని మధ్యలో కూర్చుని.. తోకపట్టుకుని లాగుతూ ఎంజాయ్ చేశాడు. కాసేపటికి ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూసి నోరెళ్ళబెట్టారు.

 ఈలోగా అక్కడి స్థానికులు దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు అవాక్కవుతుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కొండ చిలువతో ఆడుకుంటుంటే దాని నుంచి దూరంగా తీసుకురావల్సింది పోయి వీడియోలు తీసి ఆనందించడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. 
Sun, Sep 09, 2018, 10:40 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View