మరో కలర్ వేరియంట్‌ని రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 5ప్రొ
Advertisement
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొను విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్.. అలాగే 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో ఈ మొబైల్స్ లభ్యమవుతున్నాయి. 12.5 డ్యుయెల్ కెమెరాలు, 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటి వరకూ నాలుగు రంగుల్లోనే లభ్యమవుతున్న షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రొ మొబైల్ ఇప్పుడు మరో కలర్‌లో కూడా లభ్యం కానుంది. తాజాగా ఆ సంస్థ రెడ్ వేరియంట్‌ని రిలీజ్ చేసింది. గతంలో ఈ మొబైల్ బ్లాక్, బ్లూ, గోల్డ్, రోజ్‌ గోల్డ్ కలర్స్‌లో లభించేది. రెడ్‌మీ తయారీ సంస్థ తన స్వదేశమైన చైనాలో జూన్‌లో ఫ్లేమ్ రెడ్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. కానీ ఇండియాలో మాత్రం దీనిని లాంచ్ చేయలేదు. కొత్తగా మన దేశంలో రెడ్ కలర్ మోడల్  ఎమ్ఐ.కామ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో కానీ, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌‌లో కూడా లభ్యం కానుంది. 
Sun, Sep 09, 2018, 10:38 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View