భూపాలపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: టీఆర్ఎస్ నేత గండ్ర
Advertisement
Advertisement
టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు టికెట్లు లభించని అసంతృప్త నేతలు ఆవేదన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూపాలపల్లి నుంచి పోటీ చేసేందుకు తనకు టికెట్ లభించకపోవడంపై టీఆర్ఎస్ నేత గండ్ర సత్యనారాయణ మండిపడుతున్నారు. భూపాలపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.

నాడు టీడీపీలో ఉన్న తనను కేసీఆర్, కేటీఆర్ లు ఇద్దరూ సంప్రదించి, 2019 ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని చెప్పడం వల్లే తెలుగుదేశం పార్టీని వీడానని అన్నారు. కేసీఆర్ నాడు తనకు ఇచ్చిన మాటను మర్చిపోయారని, అన్యాయం చేశారని బాధపడ్డారు. తన అనుచరుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఆజంనగర్ నుండి తన ప్రచారం మొదలుపెడుతున్నట్టు గండ్ర పేర్కొన్నారు.
Sun, Sep 09, 2018, 08:43 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View