తెలంగాణ జన సమితికి కీలక నేత రాజీనామా
Advertisement
తెలంగాణ జన సమితి పార్టీ (టీజేఎస్) కీలక నేత, అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి పార్టీని వీడారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ టీజేఎస్ పై ఆరోపణలు గుప్పించారు. పార్టీలో వ్యాపారం నడుస్తోందని, పార్టీ బాగోతాన్ని బయడపెడతానని మండిపడ్డారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రేపు ఏర్పాటు చేయనున్న మీడియా సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sun, Sep 09, 2018, 08:05 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View