దేశ రాజధానిలో కాక పుట్టిస్తున్న ఎన్నికల వేడి!
Advertisement
Advertisement
ఎన్నికల వేడి రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజధానిలో కూడా కాక పుట్టిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికలను.. బీజేపీ 2019 లోకసభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కార్యవర్గం భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో బీజేపీ రాజకీయ తీర్మానాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లుండాలని.. ఇదే నవభారత నిర్మాణ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. 2019 ఎన్నికల్లో 2014లో కంటే భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 
Sun, Sep 09, 2018, 09:02 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View