రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయాలని తమిళనాడు మంత్రి వర్గం నిర్ణయం
Advertisement
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదలపై తమిళనాడు మంత్రి వర్గం ఓ నిర్ణయం తీసుకుంది. సీఎం పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడు కేబినెట్ సమావేశమైంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ ను మంత్రి వర్గం కోరనుంది. రాజ్యాంగంలోని 161వ అధికరణం కింద చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేస్తూ మంత్రి వర్గ నిర్ణయాన్ని గవర్నర్ కు పంపనుంది.
 
కాగా, 1991 మేలో ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం రాజీవ్ గాంధీని మానవబాంబుతో పొట్టనబెట్టుకుంది. రాజీవ్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు నళిని సహా ఏడుగురు నిందితులు 27 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. గవర్నర్ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టును ఆమె గతంలో ఆశ్రయించింది.
Sun, Sep 09, 2018, 07:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View