పాకిస్థాన్ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ ప్రమాణ స్వీకారం
Advertisement
పాకిస్థాన్ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్ అల్వీ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఇస్లామాబాద్ లోని అధ్యక్షుడి నివాసంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఆరిఫ్ అల్వీతో చీఫ్ జస్టిస్ సాక్విబ్ నిషార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్ ఆర్మీ చీఫ్ ఖుమర్ జావేద్ బజ్వా, ముఖ్య సైన్యాధికారులు పాల్గొన్నారు.

కాగా, ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాపకుల్లో ఒకరు ఆరిఫ్ అల్వీ. దేశాధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆరిఫ్ అల్వీ విజయం సాధించారు. ఈ ఎన్నికలలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అభ్యర్థి ఐత్ జాజ్ అహసన్, ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ - ఎన్’ అభ్యర్థి మౌలానా ఫజల్ ఉర్ రహమాన్ లపై ఆల్వీ గెలుపొందారు.
Sun, Sep 09, 2018, 06:45 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View