అలాంటి పుకార్లను ప్రచారం చేయకండి!: సోనాలి బింద్రే భర్త
Advertisement
సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య కాలంలో పుకార్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సోనాలి బింద్రే చనిపోయిందంటూ వార్తలొచ్చాయి. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా ఇదే వార్తను ట్వీట్ చేస్తూ, ఆమెకు శ్రద్ధాంజలి కూడా ఘటించేశారు. వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన తనకు వచ్చిన సమాచారం తప్పని పేర్కొంటూ, సోనాలి త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు

 దీనిపై సోనాలి భర్త గోల్డీ బెహల్ తాజాగా స్పందించారు. ఈ విషయమై ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘నా భార్య సోనాలి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని వేడుకుంటున్నా. సోషల్ మీడియాను బాధ్యతతో వినియోగించండి. ఇలాంటి పుకార్ల ప్రచారం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sun, Sep 09, 2018, 08:38 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View