‘కాంగ్రెస్’తో పొత్తుకు రంగం సిద్ధం చేసుకున్న టీ-టీడీపీ?
Advertisement
తెలంగాణ గడ్డపై టీడీపీ నిలదొక్కుకునేలా నిర్ణయాలు తీసుకుంటానని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు టీ-టీడీపీ రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు టీ-టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు చెప్పినట్టు సమాచారం.

కాగా, మరోపక్క, టీ-టీడీపీ ఎన్నికల కమిటీ రంగంలోకి దిగింది. ఈరోజు సాయంత్రం సీపీఐ  నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత కోదండరామ్ తో టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా రేపు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
Sun, Sep 09, 2018, 04:51 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View