కాపు ఉద్యమంలో ఆఖరి ఘట్టం జరుగుతోంది: ముద్రగడ పద్మనాభం
Advertisement
కాపు ఉద్యమంలో ఆఖరిఘట్టం జరుగుతోందని, సవరణలతో కూడిన కొత్తబిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో రానున్న నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ లో తమ వాటా 5 శాతం రిజర్వేషన్ దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో ఇతర కులాలతో తమకు పోటీ లేదని, ఇతర బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందని ముద్రగడ అభిప్రాయపడ్డారు.
Sun, Sep 09, 2018, 03:46 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View