మసాజ్ సెంటర్ పేరుతో హైటెక్ వ్యభిచారం .. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!
Advertisement
Advertisement
మసాజ్ కేంద్రం ముసుగులో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు. హైదరాబాద్ లోని చిలకలగూడలో నడుస్తున్న ఓ మసాజ్ సెంటర్ పై దాడిచేసిన అధికారులు నిర్వాహకుడు సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

బెంగళూరుకు చెందిన సమీర్ అగర్వాల్ 6 నెలల క్రితం మెట్టుగూడలో ఓ మసాజ్ సెంటర్ ను మొదలుపెట్టారు. అయితే వ్యాపారం అనుకున్నంతగా పుంజుకోకపోవడంతో వేరే చోట్ల నుంచి అమ్మాయిలను తెచ్చి వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టాడు. వీరి ఫొటోలను ‘లోకోంటో’ వెబ్ సైట్ లో పోస్ట్ చేసి కావాల్సిన వారు ఫోన్ చేయాలంటూ తన నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్ కు కాల్ చేసిన వారితో బేరం మాట్లాడుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అగర్వాల్ చేస్తున్న పనులపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఓ కానిస్టేబుల్ ను విటుడిగా పంపి సమాచారం సేకరించారు. అనంతరం దాడి నిర్వహించారు.

ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకుడు అగర్వాల్ పని మనుషులు షకీల్ అలీ, సుమిత్ సర్కార్ లతో పాటు విటులు అమిత్ బోస్, శశాంక్, శ్రీకాంత్ లను అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్ కు చెందిన యువతులు మోంటీసింగ్, లియాదాస్ లను రెస్క్యూ హోమ్ కు తరలించారు. నిందితుల నుంచి రూ.20 వేల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Sun, Sep 09, 2018, 03:35 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View