ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమిని ఏర్పాటు చేస్తాం: ఎల్.రమణ
Advertisement
ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి ఏర్పాటు చేస్తామని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, అన్ని పార్టీలను కలుపుకుని ఈ కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారని, అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

టీడీపీని దెబ్బతీయాలని ప్రయత్నించిన టీఆర్ఎస్, బీజేపీ లతో కలిసి పనిచేసే ఆలోచన లేదని, ఇప్పటి నుంచి అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు మొదలు పెడతామని, సీట్ల సర్దుబాటు కన్నా కేసీఆర్ ను ఓడించడమే మహాకూటమి లక్ష్యమని, తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు వివరిస్తామని చెప్పారు.
Sun, Sep 09, 2018, 01:58 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View