మాజీ సీఎం టంగుటూరి అంజయ్య భార్య మణెమ్మ కన్నుమూత!
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత టి.అంజయ్య సతీమణి, మాజీ ఎమ్మెల్యే మణెమ్మ(76) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆసుపత్రిలో ఈరోజు తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన మణెమ్మ.. సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2008లో జరిగిన ముషీరాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు.

1942, ఏప్రిల్ 29న ఆమె హైదరాబాద్ లో జన్మించారు. చాదర్ ఘాట్ లోని మార్వాడి హిందీ విద్యాలయలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.1960లో టంగుటూరి అంజయ్యను ఆమె పెళ్లాడారు. అంజయ్య-మణెమ్మ దంపతులకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మణెమ్మ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు సంతాపం తెలిపారు. అంజయ్య కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి అందించిన సేవలను నేతలు కొనియాడారు.
Sun, Sep 09, 2018, 01:10 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View