బిగ్ బాస్ కు షాక్... కౌశల్ ఆర్మీ పెద్దదే... 2కే రన్ కు భారీ స్పందన!
Advertisement
కౌశల్ ఆర్మీ... టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-2లో టైటిల్ గెలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్ లలో కౌశల్ కు బయట మద్దతుగా నిలుస్తూ, ప్రతి వారం ఆయనకు ఓటేస్తున్న ఫ్యాన్స్ టీమ్. అయితే, కొంతమంది వ్యక్తులే, వందలాది ఫేక్ మెయిల్ ఐడీలు సృష్టించి కౌశల్ ఆర్మీని ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి. అసలు కౌశల్ ఆర్మీ అన్నది ఉందో లేదో ఇంతవరకూ అధికారికంగా తెలియకపోగా, ఇప్పుడు అటువంటిది ఉందని వెల్లడైంది. బిగ్ బాస్ లో కౌశల్ విజయాన్ని కాంక్షిస్తూ, వందలాది మంది కౌశల్ బొమ్మలున్న టీషర్టులు ధరించి హైదరాబాదులో 2కే రన్ నిర్వహించి, బిగ్ బాస్ కు షాకిచ్చారు.

కౌశల్ ఎప్పుడు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చినా, ఈ ఆర్మీ భారీగా ఓట్లు వేసి, ఆయన్ను సేఫ్ జోన్ లోకి తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. కౌశల్ కు అభిమానులుగా ఉన్న వారు ర్యాలీలో పాల్గొనాలని నిన్న సోషల్ మీడియా ద్వారా కౌశల్ ఆర్మీ పిలుపునివ్వగా, నేటి ఉదయం మాదాపూర్ లో జరిగిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లల తల్లులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంకోసారి తమది పెయిడ్ ఆర్మీ అంటే ఊరుకోబోయేది లేదని ర్యాలీకి వచ్చిన వారు హెచ్చరించడం గమనార్హం. దీంతో కౌశల్ కు ఇంత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? అన్న కొత్త చర్చ మొదలైంది.
Sun, Sep 09, 2018, 11:56 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View