విమానాశ్రయాల్లో దిగిరానున్న స్నాక్స్‌ ధరలు!
Advertisement
ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే ధనికులకే పరిమితం. ఇప్పుడు మధ్య తరగతి వారికి కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. కానీ విమానాశ్రయాల్లో ఆహారం, స్నాక్స్‌, ఇతరత్రా పదార్థాల ధరలు మాత్రం అందుబాటులోకి రాలేదు. టీ, కాఫీ నుంచి నీళ్ల సీసా వరకు అన్నింటి ధరా రెండుమూడు రెట్లు అధికమే.

దీనిపై సాధారణ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో భారత విమానయాన ప్రాధికార సంస్థ (ఏఏఐ) ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి తక్కువ ధరకే స్నాక్స్‌ అమ్మాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్లను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ నిర్వహణలో ఉన్న 90 విమానాశ్రయాల్లో కౌంటర్లు ఏర్పాటుచేసి నీళ్లబాటిల్‌ నుంచి చిరుతిళ్ల వరకు అన్నింటినీ ఎమ్మార్పీ ధరకే అమ్మాలని నిర్దేశించింది. ఇకపై టీ, కాఫీ  పది రూపాయలకే అందుబాటులో ఉంటాయని ఏఏఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Sun, Sep 09, 2018, 11:48 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View