ఆమె సన్యాసిని కాదు... వేశ్య!: కేరళ నన్ పై పీసీ జార్జ్ సంచలన ఆరోపణ
Advertisement
క్రైస్తవ సన్యాసినిపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కు మద్దతిస్తూ మాట్లాడిన స్వతంత్ర ఎమ్మెల్యే, పీసీ జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తాజాగా కొట్టాయంలో మీడియాతో మాట్లాడిన, జార్జ్, ఆ నన్ ను పచ్చి వేశ్యగా అభివర్ణించారు. ఆమె ఒక వ్యక్తితో రెండేండ్లుగా లైంగిక సంబంధాలు నడిపిందని, పవిత్రమైన సన్యాసినిగా ఉన్న ఆమెను వేశ్యనికాక, ఇంకేమని పిలవాలని ప్రశ్నించారు.

బిషన్ తనను 13 సార్లు అత్యాచారం చేశాడని ఆమె చేసిన ఆరోపణలను గుర్తు చేస్తూ, తొలుత 12 సార్లు అత్యాచారం జరిగినప్పుడు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. నన్ అంటే ఆమె కన్యగా ఉండాలని, తన కన్యత్వాన్ని కోల్పోయిన ఆమెను సన్యాసినిగా పరిగణించలేమని కటువు వ్యాఖ్యలు చేశారు. సమాజంలో పేరున్న ప్రముఖుల పరువు తీసేందుకు కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, వారిలో ఈమె ఒకరని నిప్పులు చెరిగారు. కాగా, జార్జ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సుధీరన్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.
Sun, Sep 09, 2018, 11:42 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View