మామను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయించబోయి.. అడ్డంగా బుక్కయిన అల్లుడు!
Advertisement
కుటుంబంలో గొడవలు అన్నవి సహజంగా వస్తూ ఉంటాయి. దాన్ని పట్టుకుని వీధికి ఎక్కితే కుటుంబం పరువే పోతుంది. తాజాగా పిల్లనిచ్చిన మామతో గొడవపడ్డ ఓ అల్లుడు ఆయన్ను జైలుకు పంపేందుకు ప్లాన్ వేశాడు. ఆయన ఇంట్లో నిషేధిత మత్తుమందు ఉంచి పోలీసులకు సమాచారం అందించాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయి జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.

సిద్దిపేటలోని గణేశ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను హైదరాబాద్ లోని ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. కొన్నిరోజుల క్రితం మామాఅలుళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మామను జైలుకు పంపాలని పథకం పన్నిన అల్లుడు ఆయన ఇంట్లోని కారు కింద 3 కేజీల నిషేధిత అల్ఫాజోలం పెట్టాడు. అనంతరం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయమై కూపీలాగగా, అల్లుడు దొరికిపోయాడు. దీంతో సదరు ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? తదితర అంశాలపై అతడిని విచారిస్తున్నారు.
Sun, Sep 09, 2018, 11:36 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View