భారత టెలివిజన్ రంగంలో సరికొత్త చరిత్ర.. గే స్వయంవరానికి సిద్ధమవుతున్న బిగ్‌బాస్ మాజీ పోటీదారు!
Advertisement
స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దేశంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సెక్షన్ 377ను సుప్రీం కొట్టి వేసిన తర్వాత ఇప్పుడు స్వలింగ వివాహాలపై పోరుకు ఎల్‌జీబీటీక్యూలు సిద్ధమవుతుండగా, మరోవైపు బిగ్‌బాస్ షో మాజీ పోటీదారు సవ్యసాచి సత్పతి మరో అడుగు ముందుకేశాడు. ఓ టీవీ చానల్‌లో గే స్వయవరంతో ముందుకు రానున్నాడు. ఈ షో ద్వారా తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోనున్నాడు.

బిగ్‌బాస్-11 కంటెస్టెంట్ అయిన సవ్యసాచి తన సెక్సువాలిటీని ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన దేశంలోనే తొలిసారిగా భారత టెలివిజన్‌లో తన కోసం ‘గే స్వయంవరం’ నిర్వహించాలని నిర్ణయించాడు.

గతంలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ నిర్వహించిన ‘రాఖీ కీ స్వయంవర్’, ‘రాహుల్ కా స్వయంవర్’ వంటి షోలను సవ్యసాచి షో పోలి ఉంటుంది. అయితే, ఇది గే స్వయంవరం కావడం విశేషం. షోలో పాల్గొన్న వారి నుంచి సవ్యసాచి తనకు నచ్చిన ‘వరుడి’ని ఎంచుకోనున్నాడు. ఈ విషయాన్ని సవ్యసాచి నిర్ధారించాడు. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్‌లు, టీవీ చానళ్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపాడు. తన షో భారత టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టించబోతోందని ఆయన పేర్కొన్నాడు.
Sun, Sep 09, 2018, 10:43 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View