శ్రీలంకకు 160 రైల్వే ప్యాసింజర్ కోచ్‌లను సరఫరా చేయనున్న భారత్
Advertisement
పొరుగు దేశం శ్రీలంకకు 160 రైల్వే ప్యాసింజర్ కోచ్‌లను సరఫరా చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 82.64 మిలియన్ డాలర్లు. ఈ మేరకు భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐటీఈఎస్-శ్రీలంక ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదిరింది.

శ్రీలంకలో రైల్వే ట్రాక్‌ల అప్‌గ్రెడ్రేషన్, రైల్వే రోలింగ్ స్టాక్‌ కోసం కుదుర్చుకున్న 318 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌లో ప్రస్తుత కాంట్రాక్ట్ భాగమని రైల్వే ఆర్ఐటీఈఎస్ వర్గాలు తెలిపాయి. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-శ్రీలకం ప్రభుత్వం మధ్య గతేడాది జూన్‌లోనే ఈ ఒప్పందం కుదిరింది.

తాజా ఒప్పందంలో భాగంగా 6 డీఎంయూలు, 10 లోకోమోటివ్‌లు, 20 కంటైనర్ క్యారియర్‌లు, 30 ఫ్యూయల్ ట్యాంకు వేగన్లను భారత్ సరఫరా చేయనుంది.
Sun, Sep 09, 2018, 10:21 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View