మందేసి బొజ్జలు పెంచుతున్న నావికా దళ జవాన్లు... కీలక ఆదేశాలు జారీ!
Advertisement
సబ్సిడీపై మద్యం తక్కువ ధరకే లభించడంతో నిత్యమూ పూటుగా తాగేస్తున్న నౌకాదళ జవాన్లు, ఉద్యోగులు, బొజ్జలు పెంచేసి, సంతృప్తికరంగా విధులను నిర్వహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మోతాదుకు మించి మద్యం తాగుతున్న కారణంగా ఉద్యోగుల్లో ఊబకాయం సమస్యలు పెరిగాయన్న రిపోర్టులతో, అధిక బరువు, ఒబేసిటీతో ఉన్న వారికి సబ్సిడీపై మద్యాన్ని విక్రయించరాదన్న ఆదేశాలు జారీ అయ్యాయి.

 నావికా దళంలోని అన్ని స్థాయుల్లోని ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుందని నార్త్ వెస్ట్ రీజియన్ కమాండర్ రాకేష్ పాల్ వెల్లడించారు. బరువు తగ్గాలని మెడికల్ బోర్డు సూచించిన ప్రతి ఒక్కరికీ ఇకపై తక్కువ ధరకు మద్యం లభించదని ఆయన అన్నారు. వారు తిరిగి, తమ బరువును అదుపులోకి తెచ్చుకున్న తరువాత చౌక మద్యం సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.
Sun, Sep 09, 2018, 10:15 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View