తమిళనాట అధికార పార్టీకి సరికొత్త న్యూస్‌ ఛానల్‌!
Advertisement
తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ సొంత టీవీ ఛానల్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి ‘న్యూస్‌ జే’ పేరుతో ప్రసారాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ను అదే రోజు ప్రారంభించనున్నారు. పురచ్చితలైవి జయలలితకు అండదండగా నిలిచిన జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికలు శశికళ కుటుంబం నిర్వహణలో ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే సొంతంగా ఓ పత్రిక, చానెల్‌ నిర్వహించడం అత్యవసరమని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నిర్ణయించారు. ఇప్పటికే ‘నమదు పురచ్చితలైవి అమ్మ‘ పేరుతో పత్రిక ప్రారంభంకాగా రెండు రోజుల్లో చానల్‌ అందుబాటులోకి రానుంది.
Sun, Sep 09, 2018, 10:02 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View