మొదట్లో 'మహానటి'ని నేనే... ఆ సినిమా ఎందుకు వదులుకున్నానో చెప్పను!: నిత్యా మీనన్
Advertisement
'అలా మొదలైంది'తో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నిత్యా మీనన్, ఈ సంవత్సరం సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన 'మహానటి'లో సావిత్ర పాత్ర చేయాల్సివుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నిత్యా మీనన్, ఈ పాత్రకు తొలుత తాను ఓకే చెప్పానని అంది. తనను సావిత్రిలా ఉన్నావని చాలా మంది పోల్చారని, అప్పుడు ఎంతో సంతోషం వేసిందని చెప్పిన నిత్య, 'మహానటి'లో నటించమని అడిగితే, అంత అద్భుతమైన పాత్రను వదులుకోలేక, చేస్తానని చెప్పానని, అయితే, ఆపై కొన్ని కారణాల వల్ల సినిమాను వదులుకున్నానని చెప్పింది. 'మహానటి'ని వదులుకున్న కారణాలను మాత్రం చెప్పలేనని వెల్లడించింది. 
Sun, Sep 09, 2018, 09:33 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View