సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
Advertisement
*  సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ ఊరికే సాయం చేయరని అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంత. 'ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఇది నా కష్టమే. నాకు కష్టపడడమే తెలుసు. ఇక్కడా కష్టపడ్డాను. సక్సెస్ వచ్చింది. అంతేకానీ, ఎవరో సాయం చేస్తే ఈ స్థాయికి రాలేదు' అని చెప్పింది.      
*  ప్రముఖ నటుడు జగపతిబాబు త్వరలో ఓ మల్టీ స్టారర్ లో హీరోగా నటించనున్నాడు. నూతన దర్శకుడు అన్బరసన్ దర్శకత్వంలో రూపొందే బహుభాషా చిత్రంలో జగపతిబాబు ఓ హీరోగా నటిస్తాడు. ఇందులో సీనియర్ నటుడు అర్జున్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ఇతర హీరోలుగా నటిస్తారని సమాచారం.
*  యంగ్ హీరో రామ్ కథానాయకుడుగా రూపొందుతున్న 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. మరికొన్ని పాటలు మాత్రం బ్యాలెన్స్ గా వున్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించే చిత్రంలో ఆది సాయికుమార్ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో మిస్తి చక్రవర్తి కథానాయికగా నటిస్తుంది. 
Sun, Sep 09, 2018, 07:32 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View