ఇండియాకు ఎగిరే ట్యాక్సీలు రానున్నాయి!
Advertisement
 అంతా సవ్యంగా జరిగితే, భారత్ లో త్వరలో ఎగిరే ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వినూత్న కార్యక్రమానికి ఊబర్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ విషయమై ప్రధాని మోదీతో భేటీ అయినట్టు ఊబర్ వెల్లడించింది. ఊబర్ ప్రతినిధులు ఎరిక్ ఆలీసన్, గోయెల్ గ్లోబెల్... మొబిలిటీ సదస్సు సందర్భంగా ప్రధానితో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

అమెరికాలో డల్లాస్, లాస్ ఏంజిల్స్ నగరాలను గతంలోనే ఎగిరే ట్యాక్సీల కోసం ఎంపిక చేసుకున్న ఊబర్.. తాజాగా ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాలను తన ఖాతాలో చేర్చుకుంది. 2023 నాటికి ఎగిరే ట్యాక్సీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఊబర్ భావిస్తోంది. 
Sat, Sep 08, 2018, 09:52 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View