రానా సమర్పణలో వచ్చిన ‘కంచరపాలెం’పై మహేశ్ బాబు ప్రశంసలు
Advertisement
నిన్న విడుదలైన ‘c/o కంచరపాలెం’ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమర్పణలో వచ్చిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, ప్రముఖ అగ్రహీరో మహేశ్ బాబు ఈ చిత్రాన్ని చూశాడు. ఈ సందర్భంగా తన ట్వీట్ ద్వారా మహేశ్ స్పందించారు. క్లాస్ కు దూరంగా ఉన్న చిత్రమిదని, ఇది నిజంగా ‘డైరెక్టర్స్ ఫిల్మ్’ అని ప్రశంసించారు.

అద్భుతంగా పాత్రలను మలచారని, క్లైమాక్స్ ఈ సినిమాకు హృదయం లాంటిదని అన్నారు. తొలి సినిమానే అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వెంకటేశ్ మహాకు శుభాకాంక్షలు చెప్పిన మహేశ్ బాబు, తనకు ఈ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నారు. కొత్త నటీనటులతో నిర్మించినందుకు, ఇలాంటి నైపుణ్యాన్ని ప్రోత్సహించిన దగ్గుబాటి రానాను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని మహేశ్ అన్నాడు.
Sat, Sep 08, 2018, 08:30 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View