జేసీకి వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు: టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
Advertisement
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, జేసీకి వయసు మీద పడింది కానీ బుద్ధి రాలేదని, సభ్యతాసంస్కారాలు లేవని, అందుకే, ఆయన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

అనంతపురం జిల్లాలో అధికారులను, మీడియాను బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని ఆరోపించారు. జేసీని తాను కూడా దూషించగలను కానీ, తనకు సంస్కారం అడ్డమొస్తోందని అన్నారు. జేసీ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తన తల నరుక్కుంటానని సవాల్ విసిరారు. సహనానికి కూడా హద్దులు ఉంటాయని, ఇక తన సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. జేసీ తీరుతో పార్టీకి చాలా నష్టం జరుగుతోందని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు.
Sat, Sep 08, 2018, 08:01 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View