నాకు, కేసీఆర్ కు మధ్య విభేదాలు సృష్టించాలని మోదీ ప్రయత్నించారు!: ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ కు, తనకు మధ్య విభేదాలు సృష్టించాలని ప్రధాని మోదీ ప్రయత్నించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో ఉన్న ఏ హామీని నిలబెట్టుకోలేదని, తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బెదిరిస్తోందని, కేంద్ర సంస్థలను ఉసిగొల్పే సంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. బీజేపీ పాలనలో ప్రజలకు ఏమైనా ఒరిగిందా? అని ప్రశ్నించిన చంద్రబాబు, పెద్దనోట్ల రద్దు వల్ల బ్యాంకులపై నమ్మకం పోయిందని విమర్శించారు. 
Sat, Sep 08, 2018, 07:25 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View