'భారత్' విషయంలో ప్రియాంకను ఒప్పించే ప్రయత్నం చేశా.. కానీ కుదరలేదు!: సల్మాన్
Advertisement
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో నటించే సినిమాని ఏ హీరోయిన్నూ వదులుకోదు కదా? ప్రియాంక చోప్రా కూడా సల్మాన్‌తో 'భారత్' సినిమాలో కలిసి నటించే అవకాశాన్ని వదులుకునే విషయంలో ఇటీవల చాలా బాధపడిందట. ప్రియుడు నిక్ జోనాస్‌తో ఎంగేజ్‌మెంట్, అనంతరం పెళ్లి కారణంగా అమ్మడు ఆ చిత్రాన్ని మిస్ అయింది. ప్రియాంక తప్పుకోవడంతో ఆ ఛాన్స్ కత్రినా కైఫ్ కొట్టేసింది.

తాజాగా ఈ విషయంపై సల్లూ భాయ్ స్పందించాడు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయమై మాట్లాడుతూ, ప్రియాంకకు 'భారత్' మూవీ నుంచి తప్పుకోవడం చాలా కష్టమైందని అన్నాడు. ఎందుకంటే, ఈ సినిమాలో నటించడానికి గాను తన చెల్లి అర్పితకు ప్రియాంక వెయ్యి సార్లయినా ఫోన్ చేసి ఉంటుందని, దర్శకుడు అబ్బాస్ కి కూడా ఫోన్ చేసి సినిమాలో చాన్స్ ఇమ్మని అడిగిందని సల్మాన్ చెప్పాడు.

అయితే, పెళ్లి మూలంగా సినిమా నుంచి తప్పుకున్న తర్వాత చాలా బాధపడిందని తెలిపాడు. తాను నిశ్చితార్థ సమయంలో భారత్ మూవీలో చేసేందుకు ప్రియాంకను ఒప్పించే ప్రయత్నం చేశానని, కానీ ఆమె తన సమస్య తాను చెప్పిందని సల్మాన్ చెప్పాడు.
Sat, Sep 08, 2018, 09:21 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View