10న జరిగే భారత్ బంద్ కు ‘జనసేన’ మద్దతు
Advertisement
రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్రోలును గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తూనే వుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ మనదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉండడం గర్హనీయం.

ఈ నేపథ్యంలో ఈ నెల 10 దేశవ్యాప్తంగా జరగనున్న భారత్ బంద్ కు ‘జనసేన’ మద్దతు పలికింది. ఈ బంద్ లో పాల్గొనవలసిందిగా తమను ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కోరినందుకు ధన్యవాదాలు తెలిపారు.                 
Sat, Sep 08, 2018, 06:45 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View