ముద్దు సీన్లకు భయపడి.. హిందీ 'అర్జున్ రెడ్డి' నుంచి తప్పుకున్న హీరోయిన్
Advertisement
విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన విజయ్ కు ఈ సినిమా స్టార్ డమ్ ను కట్టబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను తమిళం, హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కథానాయకుడి పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు. హీరోయిన్ గా తార సుతారియాను ఎంపిక చేశారు.

అయితే, 'అర్జున్ రెడ్డి' ఒరిజినల్ సినిమాను చూసిన తార భయపడిపోయిందట. హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో... తాను నటించలేనంటూ సినిమా నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా ధ్రువీకరించింది. మరో హీరోయిన్ కోసం ధర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు. హిందీ వర్షన్ కు కూడా సందీప్ రెడ్డే దర్శకత్వం వహిస్తున్నాడు.  
Sat, Sep 08, 2018, 06:04 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View