సోదరి వైద్యం కోసం సాయం కోరిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్!
Advertisement
'దుబాయ్ శీను', 'రగడ' వంటి తెలుగు సినిమాలలో కూడా నటించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అభిమానులను సహాయం కోరుతున్నాడు. అయితే, ఆర్థికంగా కాదు. మంచి చికిత్స చేసే వారి వివరాలు తెలపమంటూ కోరుతున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆయన సోదరి సోఫియా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీనికి మంచి చికిత్సా విధానాన్ని సూచించాలంటూ అడుగుతున్నాడు.

ఈమేరకు ట్వీట్ చేస్తూ, ‘‘నా సోదరి సీఐడీపీ (నరాల బలహీనత)తో బాధపడుతోంది. దీనికి స్టెరాయిడ్స్ ట్రీట్‌మెంట్ మాత్రమే ఇస్తారు. అయితే, అది సరిపోవట్లేదు. వేరే ట్రీట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. దయచేసి రీ ట్వీట్‌తో మాకు సాయం చేసేవారికి ఈ సందేశం చేర్చండి’’ అంటూ సుశాంత్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు తమకు తెలిసిన వైద్యుల వివరాలను కామెంట్ రూపంలో పేర్కొన్నారు. సాయం చేసిన వారందరికీ సుశాంత్ థాంక్స్ చెప్పాడు.
Sat, Sep 08, 2018, 05:04 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View