‘ఎన్టీఆర్’ సెట్ లో నాకు చంద్రబాబే కనిపించాడు!: రానాకు కాంప్లిమెంట్ ఇచ్చిన సురేశ్ బాబు
Advertisement
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్, చంద్రబాబుగా రానా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రానా పాత్రపై ఆయన తండ్రి సురేశ్ బాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఈ సినిమా సెట్ కు తాను వెళ్లాననీ, అక్కడ రానాను తాను గుర్తుపట్టలేక పోయానని సురేశ్ బాబు అన్నారు. అక్కడ ఉన్నది చంద్రబాబు కాదు, రానా అని చెబితే ఎవ్వరూ నమ్మరని వ్యాఖ్యానించారు. తనకు అక్కడ కేవలం చంద్రబాబే కనిపించాడని వెల్లడించారు. ‘రానా స్టూడియోలో అచ్చం చంద్రబాబులా స్టిల్స్ ఇస్తూ నిలబడ్డాడు. నేను అతడిని అస్సలు గుర్తుపట్టలేకపోయాను. ఈ సినిమాలో రానా క్యారెక్టరైజేషన్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది’ అని సురేశ్ బాబు అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
Sat, Sep 08, 2018, 03:37 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View