హరికృష్ణ పెద్ద కర్మ: జూనియర్ ఎన్టీఆర్ తో ముచ్చటించిన చంద్రబాబు.. ఫోటోలు చూడండి!
Advertisement
నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ దశదిన కర్మను ఈరోజు హైదరాబాద్ లో ఉన్న జలవిహార్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్, నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, హీరో నాగార్జున, ఎంపీలు మురళీమోహన్, రామ్మోహన్ నాయుడులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. హరికృష్ణ చిత్రపటానికి వీరు నివాళి అర్పించారు.

 ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను దగ్గరకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో చేయి వేసి చంద్రబాబు ముచ్చటిస్తుండటం అందరినీ ఆకట్టుకుంది.
Sat, Sep 08, 2018, 03:32 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View