అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లీకేజీ.. పక్కా కుట్రేనా?
Advertisement
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్).. భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ప్రయోగశాల ఇది. భవిష్యత్ లో మానవాళి అంతరిక్షంలో మనుగడ సాధించేందుకు ఉపయోగపడే రకరకాల ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఈ ప్రాజెక్టులో అమెరికా, రష్యా, కెనడాతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని 11 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా ఐఎస్ఎస్ లోని ఓ మాడ్యూల్ కు రంధ్రం పడటం పెను సంచలనానికి దారితీసింది. ఇక్కడి సెన్సార్లు సరైన సమయానికి స్పందించడంతో వెంటనే అప్రమత్తమైన పరిశోధకులు చిన్న రంధ్రాన్ని మూసివేయగలిగారు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరగలేదనీ, ఎవరో ఉద్దేశపూర్వకంగానే దీన్ని చేశారని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

ఐఎస్ఎస్ బయట ఎలాంటి వాతావరణం లేని కారణంగా ప్రత్యేకమైన స్పేస్ సూట్ లేకుంటే మనుషులు కొన్ని సెకన్లలోనే ప్రాణాలు కోల్పోతారు. ఐఎస్ఎస్ లోపల భూమిపైన ఉండే వాతావరణం, ఒత్తిడిని కృత్రిమంగా సృష్టిస్తారు. దీని కారణంగా ఐఎస్ఎస్ బయటితో పోల్చుకుంటే లోపల పీడనం, ఆక్సీజన్ ఉంటాయి. బయట ఒత్తిడి కారణంగా ఈ చిన్న రంధ్రం పెద్దదై పోయి ఐఎస్ఎస్ కేంద్రం ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదముంది.


ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్ కేంద్రానికి అనుసంధానించిన రష్యన్ తయారీ మాడ్యుల్ కు ఎవరో ఉద్దేశపూర్వకంగానే రంధ్రం చేసి ఉండవచ్చని రష్యా అంతరిక్ష సంస్థ డైరెక్టర్‌ దిమిత్రి రొగోజిన్‌ వ్యాఖ్యానించారు. మాడ్యూల్ తయారీ సమయంలో లేదా ఆ తర్వాత ఈ పని చేసుండొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కమిషన్ ను నియమించామనీ, మరో వారంలో తమకు ఈ నివేదిక అందుతుందని పేర్కొన్నారు.
Sat, Sep 08, 2018, 03:05 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View