తెలంగాణలో 40 స్థానాల్లో 30 శాతానికి పైగా ఓటు బ్యాంకు పదిలంగా ఉంది: చంద్రబాబుతో టీటీడీపీ నేతలు
Advertisement
లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీటీడీపీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఈ భేటీలో చర్చించారు. టీటీడీపీ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీకి ఉన్న బలాన్ని చంద్రబాబుకు నేతలు వివరించారు. రాష్ట్రంలోని 20 స్థానాల్లో టీడీపీకి 35 శాతం ఓటు బ్యాంకు పదిలంగా ఉందని చెప్పారు. మరో 20 స్థానాల్లో 32 శాతం ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి ఆదరణ తగ్గలేదని చెప్పారు.

అనంతరం టీటీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చర్చ వివరాలను వెల్లడించారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీకి చెందిన ప్రధాన నేతలంతా చంద్రబాబుతో భేటీ అయ్యామని చెప్పారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో సర్వసభ్య సమావేశం ఉందని తెలిపారు. ఈ సమావేశానికంటే ముందే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, టీటీడీపీ చేపట్టిన కార్యక్రమాలు, మేనిఫెస్టో తదితర అంశాలను ప్రస్తుతం భేటీలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.  
Sat, Sep 08, 2018, 02:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View