సూపర్ స్టార్ మహేశ్ న్యూ లుక్.. ఫొటోగ్రాఫర్ కు కాంప్లిమెంట్స్ ఇచ్చిన హీరో!
Advertisement
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ మహేశ్ తో ఫొటోషూట్ నిర్వహించాడు. ఈ ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్న అవినాశ్ ‘సూపర్ చార్మింగ్, సూపర్ ఫాస్ట్ సూపర్ స్టార్. మహేశ్ బాబుతో పోస్ట్ ప్యాకప్ షూట్’ అని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ కు మహేశ్ సైతం స్పందించాడు. ‘మీ వర్కింగ్ స్టయిల్ చాలా ఇష్టం. మీతో షూటింగ్ ఎప్పుడూ సూపర్ ఫన్ గానే ఉంటుంది. స్పెషల్ మహారాష్ట్ర భోజనాన్ని బాగా ఎంజాయ్ చేశాను’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను ట్వీట్ చేశారు. 
Sat, Sep 08, 2018, 01:02 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View