మేమెందుకు చేదు అయ్యాం? ఆయనెందుకు తీపి అయ్యారు?: కొండా సురేఖ
Advertisement
టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో తమ పేరును ప్రకటించకపోవడంపై కొండా సురేఖ, మురళి దంపతులు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ గుర్తుపైనే గెలిచిన తాము ఆ పార్టీకి చేదు అయ్యామని... టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకరరావు ఎందుకు తీపి అయ్యారని సురేఖ ప్రశ్నించారు. తమకు, ఎర్రబెల్లికి పడదనే విషయం తెలిసినప్పటికీ ఆయనను పార్టీలో చేర్చుకున్నారని... ఆ విషయంలో తమను కనీసం సంప్రదించలేదని మండిపడ్డారు.

 తాము రెండు సీట్లు అడిగామని అనడం అబద్ధమని... మధుసూదనాచారికి భూపాలపల్లి టికెట్ ఇవ్వకపోతే ఆ అవకాశం తమకు ఇవ్వాలని మాత్రమే తాము అడిగామని చెప్పారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వల్ల తాము ఎలాంటి లబ్ధి పొందలేదని, పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని తెలిపారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే సత్తా తమకు ఉందని... అవసరమైతే తాను, తన భర్త, తన కుమార్తె మూడు స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పారు.
Sat, Sep 08, 2018, 01:00 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View