లైంగిక వేధింపులు మానవ తప్పిదాల్లో భాగం: కేరళ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జోసెఫిన్‌
‘తప్పు చేయడం మానవ సహజం. లైంగిక వేధింపులు ఈ కోవలోకే వస్తాయి’ అంటూ కేరళ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎం.సి.జోసెఫిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. షోర్నూర్‌ ఎమ్మెల్యే పి.కె.శశిపై ఓ మహిళా నేత లైంగిక వేధింపుల ఆరోపణలు  చేయడం తెలిసిందే. కేసు నమోదు చేసిన వెంటనే దర్యాప్తు చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశించడమేకాక బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని లేఖ రాసింది.

దీనిపై మహిళా ప్యానెల్‌ స్పందిస్తూ ‘బాధితురాలు కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించలేదు. సుమోటోగా కేసు నమోదు చేద్దామన్నా మీడియాలోనూ వార్తలు రాలేదు. అలాంటప్పుడు ఎలా కేసు నమోదు చేయగలం’ అని ఎదురు ప్రశ్నించారు. ఇలాంటి కేసులు విచారించడంలో మార్కిస్ట్‌ పార్టీకి సొంత ఎజెండా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ విషయంలో మహిళా కమిషన్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని, కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బాధిత మహిళ సీపీఎం అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు.
Sat, Sep 08, 2018, 12:53 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View